ప్రభాస్ ‘అన్ స్టాపబుల్ ‘ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది

ప్రభాస్ ‘అన్ స్టాపబుల్ ‘ ఎపిసోడ్ స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తాజాగా బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ 2 కు గెస్ట్ గా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ తో పాటు తన స్నేహితుడు గోపీచంద్ సైతం హాజరై సందడి చేసారు. దీనికి సంబదించిన ప్రోమో ఎపిసోడ్ ఫై మరింత ఆసక్తి పెంచేసింది. ఎపిసోడ్ ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ అవుతుందా..అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు ఆహా తీపి కబురు తెలిపింది.

ఈ ఎపిసోడ్‌ను న్యూ ఇయర్‌ సందర్భంగా రెండు రోజుల మందే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. డిసెంబర్‌ 30న ఈ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ కానుంది. ఇప్పటికే రిలీజైన ప్రోమోలు రికార్డు స్థాయిలో వ్యూస్‌ సాధించాయి. స్టైలిష్‌ లుక్‌లో ప్రభాస్‌ను చూస్తూ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు.