కాంగ్రెస్ పార్టీ లో చేరబోతున్న తెరాస కీలక నేత

తెలంగాణ పీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి..తన దూకుడు ను కనపరుస్తున్నాడు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నాడు. సభలు , సమావేశాలు ఏర్పటు చేసి కార్య కర్తల్లో , నేతల్లో ఉత్సహం నింపుతూనే..ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. శుక్రవారం వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన లో భూపాలపల్లి జిల్లాలో కీలక రాజకీయ నాయకుడిగా ఉన్న గండ్ర సత్యనారాయణ రావు అతని అనుచరులతో రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి ప్రస్తుతం టీఆర్ఎస్ లో కొనసాగుతున్న గండ్ర వెంకటరమణా రెడ్డి చేతిలో గండ్ర సత్యనారాయణ రావు ఓడిపోయారు. తెలంగాణ తొలి స్పీకర్ మధుసూదనాచారి సొంత నియోజకవర్గం అయిన భూపాలపల్లిలో గత ఎన్నికల్లో మూడో స్థానంలో నిలవడం గమనార్హం. మరో పక్క రేవంత్ ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్’ పేరుతో కేసీఆర్‌పై యుద్ధం ప్రకటించారు. వచ్చే నెల 2వ తేదీ నుంచి డిసెంబరు 9 వరకు కాంగ్రెస్ నేతృత్వంలో చేపట్టనున్న కార్యక్రమాలను తెలంగాణ సమాజం ఆశీర్వదించి విజయవంతం చేయాలని కోరారు. అక్టోబరు 2న హైదరాబాద్‌ దిల్‌సుఖ్‌నగర్ నుంచి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన శ్రీకాంతాచారి విగ్రహం (కొత్తపేట) వరకు పాదయాత్ర చేస్తామన్నారు. ఆయన స్ఫూర్తితోనే ‘విద్యార్థి, నిరుద్యోగ జంగ్ సైరన్’ ప్రారంభిస్తామన్నారు.