క్లైమాక్స్ పూర్తి చేసుకున్న ‘గేమ్ చేంజర్’

స్టార్ డైరెక్టర్ శంకర్ – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలయికలో తెరకెక్కుతున్న మూవీ ‘గేమ్ చేంజర్’. దిల్ రాజు నిర్మాణంలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ఈ మూవీ లో చరణ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. కాగా తాజాగా ఈ మూవీ తాలూకా క్లైమాక్స్ షూటింగ్ పూర్తి చేసారు. ఈ మేరకు డైరెక్టర్ శంకర్ ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేసి అభిమానులకు తెలియజేసారు.

‘ఎలక్ట్రిఫయింగ్ క్లైమాక్స్‌‌‌‌‌‌‌‌ షూట్‌‌‌‌‌‌‌‌ను కంప్లీట్‌‌‌‌‌‌‌‌ చేశాం’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. శంకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సినిమాల్లో క్లైమాక్స్‌‌‌‌‌‌‌‌ ఏ స్థాయిలో ఉంటుందో తెలిసిందే. దీంతో సినిమాకెంతో కీలకమైన పార్ట్ షూట్ పూర్తయినట్టు అర్థమవుతోంది. ఈ చిత్రంలో జ‌‌‌‌‌‌‌‌యరామ్‌‌‌‌‌‌‌‌, అంజ‌‌‌‌‌‌‌‌లి, సునీల్, శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌, న‌‌‌‌‌‌‌‌వీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. క్లైమాక్స్ షూట్ కంప్లీట్ చేసిన శంకర్.. ఇక తన ఫోకస్‌‌‌‌‌‌‌‌ను ‘ఇండియన్‌‌‌‌‌‌‌‌ 2’కి షిప్ట్ చేస్తున్నానని, ఆ సినిమాకు సంబంధించి సిల్వర్ బుల్లెట్ సీక్వెన్స్ చిఙ్కతరించబోతున్నారని తెలిపారు.