గవర్నర్లతో ప్రధాని మోడి ప్రసంగం

PM Modi addresses inaugural session of Governors’ Conference on National Education Policy

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఈరోజు రాష్టాల గవర్నర్లతో కొత్త విద్యావిధానంపై కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌, ప్ర‌ధాని మోడి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ర‌మేశ్ పోఖ్రియాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. కేవ‌లం చ‌దువుకోవ‌డ‌మే కాదు నేర్చుకోవ‌డంపైన కొత్త విద్యావిధానం ఫోక‌స్ చేసిన‌ట్లు ప్ర‌ధాని తెలిపారు. విద్యార్థుల్లో సృజ‌న్మాత‌క ఆలోచ‌న‌లు క‌లిగించే విధంగా నూతన విద్యావిధానం ఉంటుంద‌న్నారు. ఈ కొత్త విధానంలో తాము ప్యాష‌న్‌, ప్రాక్టికాలిటీ, ప‌ర్ఫార్మెన్స్‌పై దృష్టిపెట్టిన‌ట్లు ప్ర‌ధాని మోడి చెప్పారు. విద్యా విధానం, విద్యా వ్య‌వ‌స్థ ముఖ్య‌మైన‌వ‌ని, అవి దేశ ఆకాంక్ష‌ల‌ను నెర‌వేరుస్తాయ‌ని ప్ర‌ధాని తెలిపారు. కేంద్ర‌, రాష్ట్ర‌, స్థానిక సంస్థ‌లు అన్నీ విద్యావ్య‌వ‌స్థ బాధ్య‌త‌లను చూసుకోవాల‌న్నారు. కానీ ప్ర‌భుత్వాల జోక్యం విద్యావిధానంలో త‌క్కువ‌గా ఉండాల‌న్న అభిప్రాయాన్ని ప్ర‌ధాని వ్య‌క్తం చేశారు. టీచ‌ర్లు, పేరెంట్స్‌.. విద్యా విధానానికి క‌నెక్ట్ అయి ఉంటే, అప్పుడు విద్యార్థులు కూడా ఎక్కువ శ్ర‌ద్ధ చూపిస్తార‌న్నారు.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/