మాస్కు లేకుండా బయటకు వస్తే జరిమానా!
ఉత్తరప్రదేశ్ లో నిబంధన అమలు

Lucknow: ఉత్తరప్రదేశ్‌లో కోవిడ్- 19 నిబంధనలలో మరో నిబంధనను కొత్తగా జతచేర్చారు.
దీని ప్రకారం ప్రకారం మాస్కు వేసుకోకుండా బయట తిరిగితే పోలీసులు రూ.100 నుంచి రూ .500 వరకు జరిమానా వసూలు చేస్తారు.
ద్విచక్ర వాహనంపై వెనుక కూర్చున్న వ్యక్తికి రూ. 250 నుంచి వెయ్యి వరకూ జరిమానా వసూలు చేస్తారు.
ఉత్తరప్రదేశ్‌లో మాస్కులు ధరించని 5,300 మందికి చలానాలు విధించారు. అలాగే ద్విచక్ర వాహనాలపై వెనుక కూర్చున్న 200 మందిపై చర్యలు తీసుకున్నారు.
అదనపు ప్రధాన కార్యదర్శి (హోం అండ్ ఇన్ఫర్మేషన్) అవనీష్ కుమార్ అవస్థీ మాట్లాడుతూ మాస్కులు ధరించనందుకు 5,298 మందికి చలాన్ విధించామని తెలిపారు.
గరిష్టంగా 1461 చలాన్లు రాజధాని లక్నోలో విధించామని, 1306 చలాన్లు వారణాసిలో విధించామని వివరాలు చెప్పారు. .
తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/