గద్దర్ ను భయపెట్టి నామినేషన్ వేయకుండా చేసారు – కేఏ పాల్

ప్రజాశాంతి పార్టీ తరుపున గద్దర్ ను నామినేషన్ వేయకుండా భయపెట్టారని , ఆయన నామినేషన్ వేయకున్నప్పటికీ ఆయన పాట ద్వారా పార్టీ కి మద్దతు ఉంటుందని కేఏ పాల్ తెలిపారు. కోమటిరెడ్డి రాజగోపాల్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడం తో మునుగోడు కు ఉప ఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం నామినేషన్ల పర్వం ముగిసింది. టిఆర్ఎస్ తరుపున ప్రభాకర్ , బిజెపి తరుపున రాజగోపాల్ , కాంగ్రెస్ నుండి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేయగా..ప్రజాశాంతి పార్టీ తరుపున ప్రజా గాయకుడు గద్దర్ బరిలో నిలుస్తారని అంత అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో ఆయన కాకుండా కేఏ పాల్ నామినేషన్ వేశారు.

నామినేషన్ అనంతరం పాల్ మాట్లాడుతూ..తమ పార్టీ అభ్యర్థిగా గద్దర్‌ను నామినేషన్ వేయకుండా అధికార పార్టీ నాయకులు బెదిరించారని ఆరోపించారు. గద్దర్ నామినేషన్ వేయకున్నా తన పాట ద్వారా పార్టీకి మద్దతు ఉంటుందని చెప్పారని అన్నారు. తాను నామినేషన్ వేసేందుకు రాకుండా అధికారులు అడ్డంకులు సృష్టించారని ఆరోపించారు. పాలకుల నిర్లక్ష్యం మునుగోడుకు శాపంగా మారిందని, అభివృద్ధికి నోచుకోక వెనకబాటుకు గురైందని అన్నారు. ప్రజలు తనను గెలిపిస్తే మునుగోడును ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని పాల్ హామీ ఇచ్చారు.