రాబోయే ఎన్నికల బరిలో పోటీకి సై అంటున్న గద్దర్

gaddar

ఇంతకాలం ప్రజల పక్షాన ప్రత్యక్ష విప్లవ పోరాటంలో పాల్గొన్న ప్రజా యుద్ధనౌక గద్దర్.. ఇప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లోకి అడుగుపెడుతున్నారు. గత ఎన్నికల్లో తొలిసారి ఓటు వేసిన గద్దర్.. ఇప్పుడు ఏకంగా ఎన్నికల బరిలో అభ్యర్థిగా నిలబడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్నీ స్వయంగా ఆయనే తెలిపారు. తాను పుట్టిన ఊరైన మొదక్ జిల్లా తూప్రాన్‌లోనే ఉండాలనుకుంటున్నట్లుగా తెలిపారు. తాను ఇక నుంచి తూప్రాన్‌లోనే నివాసముంటానని.. తనకు రక్షణ కల్పించాలంటూ తూప్రాన్ పోలీసులకు వినతి పత్రం కూడా సమర్పించారు.

అంతే కాదు సీఎం కేసీఆర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ నియోజకవర్గం నుంచే పోటీ చేయనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుతం ఇది తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గతంలోనూ తాను కేసీఆర్‌పై పోటీ చేస్తానని పేర్కొన్నా.. అది జరగలేదు. ఇప్పుడు ఆయనే స్వయంగా ప్రకటించటంతో.. ఆ ప్రశ్నలకు ఆన్సర్స్ దొరికినట్టైంది. ఎన్నికల్లో పోటీ చేస్తానని.. అది కూడా సీఎం కేసీఆర్‌పైనే గజ్వేల్ నుంచి పోటీ చేస్తానని ప్రకటించటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.