గుంటూరు జిల్లాలో రేపు సంపూర్ణ లాక్‌డౌన్‌

కలెక్టర్‌ శామ్యుల్‌ ఆనందకుమార్‌ వెల్లడి

samuel anand
samuel anand

గుంటూరు: జిల్లాలో కరోనా కేసులు అధికమవుతున్న నేపథ్యంలో కలెక్టర్‌ శామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం రోజు చికెన్‌, మటన్‌ షాపుల ముందు అధిక సంఖ్యలో జనం గుమిగూడుతుండడంతో రేపు జిల్లా వ్యాప్తంగా సంపూర్ణ లాక్‌డౌన్‌ను ప్రకటించారు. దీంతో రేపు ఉదయం 6నుండి 9 వరకు ఉండే నిత్యవసరాల వెసులుబాటు కూడా ఉండదని స్పష్టం చేశారు. ఇదే నిర్ణయాన్ని రోజు విడిచి రోజు అమలు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. కాగా మెడికల్‌ షాపులు. ఆసుపత్రులకు మాత్రం మినహాయింపు ఇచ్చారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/