మెక్సికోలో భారీ అగ్నిప్రమాదం.. పేలిన ఇంధన ట్యాంకర్

fuel-tanker-burst-on-rail-line-cargo-train-passes-over-it-in-mexico

మెక్సికో సిటీ: సెంట్రల్‌ మెక్సికోలోని అగాస్కాలైంటిస్‌ నగరంలో భారీ ప్రమాదం జరిగింది. రైల్వే ట్రాక్‌పై ఇంధన ట్రక్కు పేలింది. దీంతో అక్కడ భారీగా మంటలు వ్యాపించాయి. అయితే ఆ మంటల మీద నుంచే కార్గో రైలు వెళ్లింది. స్థానికంగా ఉన్న సుమారు వెయ్యి మందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. మంటలపై నుంచి కార్గో రైలు వెళ్తుంటే కొందరు అక్కడే ఉండి వీడియోలు తీశారు. భయంతో కొందరు కార్లలోనే దాక్కుకున్నారు. సమీప ప్రాంతాలకు మంటలు వ్యాపించడంతో.. అక్కడ నుంచి సుమారు 12 మందిని రక్షించారు. ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడలేదని అధికారులు చెబుతున్నారు. ట్రక్కు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.