కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో షర్మిల పోరు..

YSRTP అధినేత్రి వైస్ షర్మిల ..తెలంగాణ లో పార్టీ స్థాపించిన దగ్గరి నుండి టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. తన పాదయాత్ర లో నిత్యం సీఎం కేసీఆర్ ఫై , టిఆర్ఎస్ నేతలపై మాటల తూటాలు పేలుస్తూ వచ్చారు. ఇక ఇప్పుడు కేసీఆర్‌కు వ్యతిరేకంగా ఢిల్లీలో షర్మిల పోరు మొదలుపెట్టింది. శుక్రవారం ఢిల్లీ వెళ్లిన వైఎస్ షర్మిల కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్‌)కు ఫిర్యాదు చేశారు.

కాగ్ ఛైర్మన్ గిరీశ్ చంద్ర ముర్మును కలిసి స్వయంగా షర్మిల ఫిర్యాదు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్షల కోట్ల అవినీతి జరిగిందంటూ కాగ్ ఛైర్మన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పలు ఆధారాలను కూడా కాగ్‌కు షర్మిల సమర్పించినట్లు తెలుస్తోంది. ఒకే వ్యక్తికి కాంట్రాక్ట్ కేటాయించిన అంశంపై కాగ్‌కు వివరాలు అందించినట్లు తెలుస్తోంది.