కరోనా పైజగన్‌ వ్యాఖ్యలు సరికాదు

దానికదే వచ్చి పోవడానికి ‘కరోనా’ ఏమైనా జగన్‌ చుట్టమా?:

Yanamala Rama Krishnudu
Yanamala Rama Krishnudu

అమరావతి : ఏపీ సీఎం జగన్ కరోనా పై చేస్తున్న వ్యాఖ్యలు సరికాదని టీడీపీ నేత యనమల రామకృష్ణుడు విమర్శలు కరోనా దానికదే వచ్చి పోడానికి అదేమన్నా జగన్ చుట్టమా? అని యనమలఎద్దేవా చేశారు. ఏపీలో కరోనా మరణాలపై చేస్తోన్న ప్రకటనలపై ఆయన అనుమానం వ్యక్తం చేశారు. మృతుల సంఖ్యను దాచేస్తే కరోనా కార్చిచ్చులా కాల్చేస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. కరోనాపై నిజాలు బయటకు రాకుండా వైస్సార్సీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని, ఏపీలో ఎక్కువ పరీక్షలు చేస్తున్నారు కాబట్టే ఎక్కువ కేసులు బయటపడుతున్నాయని చెప్పడం ఆత్మవంచనేనని అన్నారు. ఇలా చెబుతూ వారు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని చెప్పారు. కరోనా వైరస్‌ కట్టడిపై నిపుణులందరూ తలలుపట్టుకుంటున్నారని, జగన్‌ మాత్రం చాలా తేలికగా తీసుకుంటున్నారని ఆయన విమర్శించారు. భారత్‌లో కరోనా కేసులు అధికంగా నమోదైన 15 జిల్లాల్లో కర్నూలు కూడా ఉందని గుర్తు చేశారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి ;https://www.vaartha.com/news/sports/