రక్షా బంధన్ సందర్భంగా బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంః సిఎం యోగి

అన్ని ఏర్పాట్లు చేయాలని ఆర్టీసీకి ఆదేశాలు

UP elections: Cm Yogi Adityanath from Ayodhya!
UP Cm Yogi Adityanath

లక్నోః ఈ నెల 11న దేశ వ్యాప్తంగా జరుగనున్న రక్షాబంధన్( రాఖీపూర్ణిమ) సందర్భంగా యూపీలోని మహిళలకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ బహుమతిని ప్రకటించారు. రెండు రోజుల పాటు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించవచ్చని ప్రకటన చేశారు. ఈ నెల 10వ తేదీ అర్ధరాత్రి నుంచి 12వ తేదీ అర్ధరాత్రి వరకు ఉచితంగా ప్రయాణించవచ్చని చెప్పారు. ఆ రెండు రోజుల పాటు మహిళలు ఉచితంగా, సురక్షితంగా ప్రయాణించేలా అన్ని ఏర్పాట్లు చేయాలని యూపీ ఆర్టీసీని ఆదేశించారు. ఈ మేరకు సీఎం యోగి కార్యాలయం ట్విట్టర్ ద్వారా తెలిపింది.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/