కరెన్సీ నోట్లు పట్టుకునేటపుడు జాగ్రత్త
కోవిడ్ 19 వైరస్‍కు దూరంగా…

కోవిడ్ 19 వైరస్‍కు దూరంగా ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసింది .
వైరస్ ఎక్కడైనా ఉండొచ్చు, గాల్లోనూ ఏదైనా వస్తువుపై కూడా కోవిడ్ 19 బ్రతికే అవకాశం ఉంది.
ప్రతిరోజు ఎన్నో కరెన్సీ నోట్లు చేతులు మారుతుంటాయి. ఒకరి చేతిలో నుంచి మరొకరి చేతిలోకి నోట్లు మారుతుంటాయి.

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా బయటకు వెళ్లలేదు కదా అనుకుంటే సరిపోదని కరెన్సీ నోట్లపై కూడా ఓ కన్నేసి ఉంచాలని ఇండియన్స్ బ్యాంకు అసోసియేషన్ హెచ్చరిస్తోంది.
వైరస్ వ్యాప్తి రోజురోజుకీ తీవ్రమవుతుండటంతో ఐబీఏ ఈ దిశగా ప్రజలను అప్రమత్తం చేస్తోంది. కరెన్సీ నోట్లపై కూడా కోవిడ్19 వైరస్ ఉండే అవకాశం ఉందని పేర్కొంది.
అందులో భాగంగానే కరెన్సీ నోట్లను ముట్టుకున్నాక ప్రతిఒక్కరూ తప్పనిసరిగా తమ చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచిస్తోంది.
తాజా కెరీర్ సమాచారం కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/specials/career/