తల్లి జ్ఞాపకార్థం ఉచిత న్యూరో వైద్య శిబిరం

3000మంది రోగులకు పరీక్షలు, మందుల పంపిణీ..డాక్టర్ ఉదయ్ గౌతమ్ ను అభినందించిన కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యె

Free neuro medical camp

హైదరాబాద్: గౌతమ్ న్యూరో కేర్, న్యూరో & మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ తన తల్లి సరళాదేవి జ్ఞాపకార్థం ఉచిత న్యూరో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. శనివారం హైదరాబాద్ ప్రగతి నగర్ జిల్లా పరిషత్ హైస్కూల్‌లో జరిగిన క్యాంపులో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ రూ. 5,000/- విలువైన ఉచిత సేవలను అందించారు. ఈ కార్యక్రమంలో కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్, నిజాంపేట మేయర్ కొలన్ నీల గోపాలరెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాదాపు 3000 మంది రోగులను వివిధ రోగ నిర్ధారణల కింద పరీక్షించారు, న్యూరోసర్జన్ కన్సల్టేషన్, E.C.G, రక్త పరీక్షలు CBP, RFT, LFT, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, లిపిడ్ ప్రొఫైల్, న్యూరోపతి స్క్రీనింగ్ బాడీ కంపోజిషన్ అనాలిసిస్ మరియు ఇతర పరీక్షలు చేసి, తర్వాత రోగులకు అవసరమైన మందులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ ఉదయ్‌ గౌతమ్‌ మాట్లాడుతూ.. గౌతమ్‌ న్యూరో కేర్‌ను ప్రారంభించి ఐదేళ్ల క్రితమే మా అమ్మ జ్ఞాపకార్థం ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈరోజు నేను బ్రెయిన్ స్ట్రోక్‌ను ముందుగానే నివారించడానికి దాని గురించి తెలుసుకోవడం కోసం చేసిన అన్ని పరీక్షలు చాలా అవసరమని సూచించాను. జూన్ 15న కామారెడ్డిలో మెగా ఫ్రీ న్యూరో మెడికల్ క్యాంపును నిర్వహించబోతున్నామని ఆయన తెలిపారు. ఉచిత న్యూరో వైద్య శిబిరం చేయాలనే ఆలోచనకు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే డాక్టర్ గౌతమ్‌ను అభినందించారు. ఈ వాణిజ్య వైద్య ప్రపంచంలో ప్రజలకు ఉచిత సేవలందించడం గొప్ప ఆలోచన అని ఆయన అన్నారు. ప్రజలకు అవసరమైన చికిత్సను ఉచితంగా అందించేందుకు ఇతర ఆసుపత్రుల యాజమాన్యాలకు ఇది స్ఫూర్తిగా నిలవాలని ఆకాంక్షించారు.