మైక్ టైసన్ బర్త్ డే గిఫ్ట్ : లైగర్ నుండి మైక్ టైసన్ వీడియో

వరల్డ్ క్లాస్ బాక్సర్ మైక్ టైసన్ బర్త్ డే ఈరోజు. ఈ సందర్బంగా లైగర్ టీం ఆయన తాలూకా సెట్స్ పిక్ ను వీడియో రూపంలో విడుదల చేసింది. విజ‌య్ దేవ‌ర‌కొండ ప్ర‌ధాన పాత్ర‌లో పూరీ జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్న చిత్రం లైగ‌ర్. ఈ చిత్రాన్ని ఛార్మీ కౌర్, కరణ్ జోహర్, అపూర్వ మెహతా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ ఒక బాక్సర్‌గా కనిపించబోతున్నాడు.

ఈ సినిమాకు మేజ‌ర్ హైలైట్ ఏంటంటే..ఈ మూవీ లో బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ ఓ కీల‌క పాత్ర‌లో న‌టించారు. ఈరోజు గురువారం మైక్ టైసన్ పుట్టినరోజు కావటంతో లైగర్ యూనిట్ ఈ చిత్రం నుంచి మైక్ టైసన్ షూటింగ్‌లో పాల్గొన్నప్పటి సన్నివేశాలను సంబంధించిన వీడియో విడుద‌ల చేసింది. ఈ వీడియోలో పూరి, ఛార్మి, కరణ్ జోహార్, విజయ్ దేవరకొండ, అనన్య పాండే తదితరులు మైక్ టైసన్‌కు పుట్టినరోజు అభినందనలు తెలియజేశారు. టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా రేంజ్‌లో రానున్న ఈ సినిమాలో మైక్ టైసన్ యాక్ట్ చేయ‌టంతో సినిమా ఫై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి.

ఈ సినిమా నాన్ థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను రూ.110 కోట్ల‌కు మేక‌ర్స్ అమ్మేశార‌ని టాక్ వినిపిస్తోంది. ఇందులో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ సోని ఆడియో హ‌క్కుల‌ను రూ.14 కోట్లు పెట్టి కొనుగోలు చేసింద‌ని టాక్‌. త‌నిష్క్ భ‌గ్చీ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి మెలోడి బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.

Team #LIGER wishes the LEGEND and the one and only – @MikeTyson a very happy birthday!

Get ready to witness the BIGGEST CLASH on the big screens!👊🏾 #LigerOnAug25th #HappybirthdayMikeTyson @TheDeverakonda @ananyapandayy @karanjohar #PuriJagannadh @Charmmeofficial pic.twitter.com/jZbv2eFLNM— Sony Music India (@sonymusicindia) June 30, 2022