అరుణాచల్ ప్రదేశ్‌లో 5.3 తీవ్రతతో భూకంపం

న్యూఢిల్లీ : ఈరోజు ఉదయం 6.56 గంటల సమయంలో అరుణాచల్‌ప్రదేశ్‌లో భారీ భూకంపం సంభవించింది. పాంజిన్‌లో భూమి కంపించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 5.3గా నమోదయిందని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సీస్మోలజీ తెలిపింది. భూకంప కేంద్రం పాంజిన్‌కు ఉత్తరాన 1176 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని పేర్కొన్నది. భూమి అంతర్భాగంలో 30 కిలోమీటర్ల లోతులో భూ ఫలకాలు కదిలాయని వెల్లడించింది. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు చెప్పారు.

తాజా అతర్జాతియ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/