హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేస్‌ రద్దు

Formula E announces cancellation of race in Hyderabad

హైదరరాబాద్‌ః హైదరాబాద్ లో జరగాల్సిన ఫార్ములా ఈ రేసు రద్దు అయింది. హైదరాబాద్ లో ఫిబ్రవరి 10 న హుస్సేన్ సాగర తీరాన జరగాల్సిన ఫార్ములా ఈ రేస్‌ జరుగాల్సి ఉండేది. కానీ హైదరాబాద్‌లో ఫార్ములా-ఈ రేస్‌ రద్దు చేస్తున్నట్లు తమ నిర్ణయం వెల్లడించింది FIA ఫార్ములా-ఈ. తెలంగాణలో కొత్త ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేసింది. రేస్ నిర్వహణపై గతంలో చేసుకున్న ఒప్పందం ఉల్లంగణపై మున్సిపల్ శాఖకు నోటీస్ ఇస్తామని స్పష్టం చేశాయి ఫార్ములా ఈ ఆపరేషన్స్. హైదరాబాద్ కి బదులుగా హాంకుక్ మెక్సికో సిటీలో ఈ రేస్ జరుగనుంది. హోస్ట్ సిటీ ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వం ఉల్లంఘించడం బాధగా ఉందంటున్నారు నిర్వాహకులు. అంతేకాదు…ఇండియా, హైదరాబాద్ ఈ రేస్ ఫ్యాన్స్ కి ఇది తీవ్ర నిరాశ మిగిల్చింది.