ఢిల్లీలో మళ్లీ మాస్క్ ధరించాలంటూ సర్కారు ఆదేశాలు

బుధవారం ఢిల్లీలో 2,146 కేసుల నమోదు

as-covid-cases-surge-delhi-govt-reintroduces-rs-500-fine-for-not-wearing-masks

న్యూఢిల్లీః మళ్లీ ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో మాస్క్ ల ధారణ విధానం అమల్లోకి వచ్చింది. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ లు ధరించడం తప్పనిసరి అంటూ ఢిల్లీ సర్కారు ఆదేశాలు జారీ చేసింది. ఉల్లంఘిస్తే రూ.500 జరిమానా చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. వ్యక్తిగత కార్లు, వ్యాన్లలో ప్రయాణించే వారికి ఈ నిబంధన వర్తించదని సర్కారు స్పష్టం చేసింది. దేశ రాజధానిలో కరోనా కేసులు గత కొన్ని రోజులుగా పెరుగుతున్నాయి. ఇది అక్కడి అధికార యంత్రాంగాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. దీంతో సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది.

ఢిల్లీలో కరోనా కొత్త ఉపరకం వ్యాప్తిలోకి వచ్చినట్టు లోక్ నాయక్ ప్రకాష్ నారాయణ్ హాస్పిటల్ గుర్తించింది. బీఏ 2.75 రకాన్ని తాము గుర్తించినట్లు ఆసుపత్రి డైరెక్టర్ సురేశ్ కుమార్ ప్రకటించారు. బుధవారం ఢిల్లీలో 2,146 కరోనా కొత్త కేసులు వెలుగు చూశాయి. పాజిటివిటీ రేటు 17.83 శాతానికి పెరిగింది. ఎనిమిది మంది మరణించారు. ఆరు నెలల్లోనే ఇదే అత్యధికం.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/