ఢిల్లీ లిక్కర్ స్కాం ఫై భట్టి విక్రమార్క కామెంట్స్

ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారం ఇప్పుడు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఈ స్కామ్ లో టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుటుంబ సభ్యులకు కూడా సంబంధం ఉందని బిజెపి ఎంపీలు ఆరోపణలు చేయడంతో తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ స్కామ్ గురించి అంత మాట్లాడుకుంటున్నారు. ఇప్పటికే బిజెపి కార్యకర్తలు ఎమ్మెల్సీ కవిత ఇంటిని ముట్టడికి యత్నించడం జరిగింది. తాజాగా ఈ స్కామ్ ఫై తెలంగాణ సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క స్పందించారు.

గాంధీ టోపీలు పెట్టుకుని, మేమే అసలైన గాంధేయవాదులంటూ చెప్పుకున్న “ఆప్” మద్యం మత్తులో కూరుకుపోవడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. ఢిల్లీ లోని మద్యం విధానం, తెలంగాణ మద్యం విధానం ఒకటేనన్నారు. ఓబెరాయ్ హోటల్ లో కూర్చుని ప్రభుత్వ మద్యం విధానాలను రూపొందించడం ఆశ్చర్యకరమన్నారు. రాష్ట్ర విభనకు ముందు, తెలంగాణ లో క్వార్టర్ బాటిల్ 30 రూపాయలు ఉంటే ఇప్పుడు బెల్ట్ షాపులు పెట్టి క్వార్టర్ బాటిల్ రూ. 200 అమ్ముతున్నారని మండిపడ్డారు. ఇంత పెద్ద వ్యత్యాసం ఉన్న డబ్బంతా ఎవరికి పోతోందని భట్టి ప్రశ్నించారు.

ఢిల్లీ లిక్కర్ స్కాం తో తెలంగాణకు సంబంధాలున్నాయని వార్తలు వస్తున్నాయని.. ఢిల్లీ లిక్కర్ స్కాం అతి పెద్ద స్కాం అయునప్పుడు, తెలంగాణ లో ఇంకెంత స్కాం జరిగిందో అనుమానాలు వస్తున్నాయన్నారు.