కాల్పులపై స్పందించిన ఇమ్రన్.. దేవుడు పునర్జన్మ ఇచ్చాడు

imran khan
imran khan

ఇస్లామాబాద్‌ః పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రన్ ఖాన్ తనపై జరిగిన కాల్పులపై తొలిసారిగా స్పందించారు. తనకు దేవుడు పునర్జన్మ ఇచ్చాడని వ్యాఖ్యానించారు. అల్లా మరో అవకాశం ఇచ్చారన్న ఆయన.. తన పోరాటాన్ని తిరిగి కొనసాగిస్తానని వెల్లడించారు. తనపై జరిగిన దాడికి ఎవరినీ నిందించడం లేదని వివరించారు. ఇమ్రాన్‌ ఖాన్‌ పంజాబ్‌ ప్రావిన్స్‌లోని వజీరాబాద్‌లో ర్యాలీ నిర్వహిస్తున్న సమయంలో ప్రసంగిస్తున్నారు. కంటైనర్‌ ట్రక్కుపై నిల్చొని మాట్లాడుతుండగా గుర్తు తెలియని ఆగంతకుడు తుపాకీతో కాల్పులు జరిపాడు.

ఈ ఘటనలో ఇమ్రాన్‌ రెండు కాళ్లకు బుల్లెట్‌ తగిలి గాయమైంది. పీటీఐ పార్టీకి చెందిన పలువురికి గాయాలయ్యాయి. చికిత్స కోసం వీరిని లాహోర్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇమ్రాన్‌ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఈ మేరకు వైద్యులు వివరాలు వెల్లడించారు. ఘటన జరిగిన వెంటనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉండగా ఇమ్రాన్‌ ఖాన్‌ కుడి కాలుకి గాయంతో పట్టి వేసుకొని ఆసుపత్రి బెడ్‌పై పడుకొని ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/