మరో వ్యాక్సిన్‌కు చైనా రెండో దశ అనుమతి

సైన్యానికి సంబంధించిన సంస్థ వ్యాక్సిన్‌ రూపకల్పన

corona vaccine
corona vaccine

బీజింగ్‌: చైనాలో ఇప్పటికే పలు కంపెనీలు తయారు చేసిన కరోనా వ్యాక్సిన్‌లు రెండో దశకు చేరుకోగా.. తాజాగా తమ దేశ సైన్యానికి చెందిన సంస్థ రూపొదించిన వ్యాక్సిన్‌ కురెండో దశ ట్రయల్స్‌ను ప్రారంభించేందుకు అనుమతి ఇచ్చామని ఆ దేశ ప్రభుత్వ అధికారికంగా ప్రకటించింది. చైనాలో ఇప్పటికే సినోఫామ్‌, వూహన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజి, వూహన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ ప్రోడక్ట్స్‌ గతంలోనే తొలిదశ ట్రయల్స్‌ను పూర్తి చేసుకుని రెండోదశకు సిద్దమయ్యాయి. అయితే ఈ వ్యాక్సిన్‌ ను అందుబాటులోకి రావడానికి ఏడాది సమయం పడుతుందని, అంతవరకు వీటి పనితీరు తెలుస్తుందని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/telangana/