2024 లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయంః చింత మోహన్

chinta-mohan

న్యూఢిల్లీః 50 ఏండ్ల తర్వాత ఒక దళిత నేత కాంగ్రెస్ అధ్యక్ష బరిలో ఉండటం శుభపరిణామంగా ఆ పార్టీ మాజీ ఎంపీ చింత మోహన్ అభివర్ణించారు. కాంగ్రెస్ పార్టీలో విప్లవాత్మక మార్పులు జరుగుతున్నాయని ఆయన అన్నారు. మల్లికార్జున ఖర్గే వివాద రహితుడని..ఆయనే కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాబోతున్నారని చెప్పారు. కొన్ని కార్పొరేట్ శక్తులు దీన్ని అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు.

హైదరాబాద్ లో పర్యటిస్తున్న శశిథరూర్ దళిత వ్యతిరేకి అన్నారు.ఆయనకి కాంగ్రెస్ గురించి ఏమి తెలీదన్నారు. కాగ్రెస్ అధ్యక్ష బరిలో పోటీ చేసినా ఆయనకు ఒక్క పర్సంటేజ్ ఓట్లు కూడా రావన్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందన్నారు. 2024 లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బిజెపి కి వంద లోపు సీట్లు మాత్రమే వస్తాయని జోస్యం చెప్పారు. దేశంలో60 కోట్ల మంది అర్థాకలితోనే అలమటిస్తున్నారని చింతామోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వంలో అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదన్నారు.కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీ లతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/