మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

munugode-bypoll-schedule-released

హైదరాబాద్‌ః మునుగోడు అసెంబ్లీ నియోకవర్గ ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదలైంది. నవంబర్‌ 3న ఉప ఎన్నికల పోలింగ్‌ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌లో తెలిపింది. ఈ నెల 7న ఎన్నికలకు నోటిఫికేషన్‌ విడుదల కానున్నది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై.. ఈ నెల 14న నామినేషన్ల స్వీకరణకు గడువు ముగియనున్నది. 15న నామినేషన్లను పరిశీలించనుండగా.. 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చింది. నవంబర్‌ 3న ఎన్నికలకు పోలింగ్‌ జరుగనుండగా.. 6న ఓట్లను లెక్కించనున్నారు. ఇంతకు ముందు ఎమ్మెల్యేగా గెలుపొందిన కోమటిరెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/