చింతమడకలో ఓటేసిన మాజీ సీఎం కేసీఆర్‌ దంపతులు

Former CM KCR’s couple voted in Chintamadaka

హైదరాబాద్‌ః మాజీ సీఎం కేసీఆర్, ఆయన భార్య శోభమ్మ సిద్దిపేట జిల్లా కేసీఆర్ స్వగ్రామం చింత మడకలో కేవీఆర్ఎస్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోనీ 13వ పోలింగ్ భూత్ లో కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు నంది నగర్ లోని జిహెచ్ఎంసి కమ్యూనిటీ హాల్లో తమ ఓటు హక్కును కేటీఆర్ కుటుంబం వినియోగించుకుంది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ… ఐదేళ్లకోసారి ప్రభుత్వాలని ఎన్నుకునే అరుదైన అవకాశం ఎన్నికలు అన్నారు. ఎలాంటి ప్రభుత్వం కావాలో రాజ్యాంగం ఇచ్చిన గొప్ప అవకాశమని తెలిపారు. మన ప్రభుత్వాలని మనం నిర్ణయించే అధికారం ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు ఈరోజు ఓటు వేయకుండా తర్వాత నిందిస్తే లాభం లేదు…దయచేసి అందరూ బయటకు వచ్చి ఓటు వేయండని కోరారు కేటీఆర్‌. మంచి ప్రభుత్వాలను మంచి నాయకులను మీ సమస్యలకు ప్రాతినిధ్యం వహించే వారికి ఓటు వేయండన్నారు.