తెలంగాణలో చేపపిల్లల పెంపకం ద్వారా నీలివిప్లవం

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌

TS Minister Talasani Srinivasa Yadav
TS Minister Talasani Srinivasa Yadav

Hyderabad: తెలంగాణలో చేపపిల్లల పెంపకం ద్వారా నీలి విప్లవాన్నీ తీసుకుని వచ్చామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ప్రకటించారు. వందకోట్లు ఖర్చు చేసి తెలంగాణ మత్స్యకారులకు ఉచితంగా చేప విత్తనాలు పంపిణీ చేశామన్నారు.

ఈ కార్యక్రమం సత్ఫలితం ఇస్తోందని అన్నారు. మత్స్యకారులు ఆర్థికంగా ఎదిగేందుకు ఇది దోహదపడుతోందని అన్నారు. అలాగే పెరిగిన చేపటలను అమ్ముకోవడానికి వీలైనంత త్వరగా చేపల మార్కెట్లు నిర్మిస్తామన్నారు .

దేశంలో ఏ రాష్ట్రం చేపట్టని విధంగా చేప పిల్లల పెంపకాన్ని ప్రభుత్వం చేపట్టిందన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే స్వాతంత్య్రం వచ్చినట్లు బడుగు బలహీన వర్గాలు భావిస్తున్నాయని తెలిపారు.

చేపల పెంపకం చేపడుతున్నాం కానీ.. వాటిని మార్కెట్‌ చేసేందుకు మార్కెట్లు లేవన్నారు. అందుకు రాష్ట్ర వ్యాప్తంగా వంద మార్కెట్లు నిర్మించాలని నిర్ణయించామని తెలిపారు.

తాజా సినిమా వార్తల కోసం: https://www.vaartha.com/news/movies/