ప్రజల జీవితాల్లో కొత్త సంవత్సరం సుఖశాంతులు నింపాలిః కెసిఆర్‌

నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన మాజీ సిఎం కెసిఆర్‌

kcr

హైదరాబాద్‌ః తెలంగాణలో నూతన సంవత్సర వేడుకల అంబరాన్నంటాయి. ప్రజలంతా సంబరంగా వేడుకలను నిర్వహించుకున్నారు. మరోవైపు, రాష్ట్ర ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజల జీవితాల్లో కొత్త సంవత్సరం సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు. కెటిఆర్, హరీశ్ రావు, గుత్తా సుఖేందర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వద్దిరాజు రవిచంద్ర, జగదీశ్ రెడ్డి, కవిత తదితరులు కూడా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.