గుత్తికోయలు దాడులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ అటవీ అధికారుల ఆవేదన

ఛత్తీస్​గఢ్​ నుంచి వచ్చిన గుత్తికోయలు అటవీ అధికారుల ఫై దాడులు చేస్తున్నారని..వీరు దాడులు చేస్తున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ వాపోయారు అటవీ అధికారులు. తాజాగా గుత్తికోయల చేతిలో ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు హత్య కు గురైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శ్రీనివాసరావు అంత్యక్రియలకు మంత్రులు పువ్వాడ, ఇంద్రకిరణ్ లు హాజరయ్యారు. ఈ క్రమంలో అటవీ అధికారులు వారిని అడ్డుకున్నారు.

గుత్తికోయల దాడుల నుంచి తమను రక్షించాలని వారంతా కోరుతూ ఆందోళకు దిగారు. తమపై గుత్తికోయలు దాడులు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మంత్రుల ఎదుట వాపోయారు. ఛత్తీస్​గఢ్​ నుంచి వచ్చిన గుత్తికోయలను రాష్ట్రం నుంచి పంపించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అటవీశాఖ అధికారులకు ఆయుధాలు సమకూర్చాలని మంత్రులకు విన్నవించారు..ఈ విషయం పట్ల సానుకూలంగా స్పందించిన మంత్రులు వారి సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళతామని హామీ ఇచ్చారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గుత్తికోయల దాడిలో మృతిచెందిన ఫారెస్టు రేంజ్‌ అధికారి (ఎఫ్‌ఆర్‌వో) శ్రీనివాసరావు పార్థివదేహానికి మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, పువ్వాడ అజయ్‌ కుమార్‌ నివాళులర్పించారు. అనంత‌రం ఆయన కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. ప్రభుత్వం అన్నివిధాలుగా అండ‌గా ఉంటుంద‌ని భరోసా ఇచ్చారు. ప్రభుత్వాధికారులపై దాడులను ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని స్పష్టం చేశారు. శ్రీనివాసరావుపై దాడికి పాల్పడి హత్యచేసిన వారిని తప్పక శిక్షిస్తామని తెలిపారు.