మసూర్‌ దాల్‌

Masur Dal
Masur Dal

కావలసిన పదార్థాలు
ఎర్రకందిపప్పు – రెండు కప్పులు, గుమ్మడికాయ బద్ద – పావ్ఞకిలో
పండిన టమాటాలు – ఒక కిలో, పెద్ద ఉల్లిపాయలు – 4పుదీనా ఆకులు – అరకప్పు, పచ్చిమిరపకాయలు – 6 కొత్తిమీర – ఒక కట్ట, అల్లం – ఒకఅంగుళం ముక్క, ఎండుమిరపకాయలు – 6, వెల్లుల్లిరేకలు – 12నూనె – 3/4 కప్పు, ధనియాజీరాపొడి – ఒక టీ స్పూన్‌జీలకర్ర – ఒక టేబుల్‌స్పూన్‌, దాల్చిన చెక్క – ఒక అంగుళం ముక్కధనియాలు – ఒక స్పూన్‌, లవంగాలు – 12,ఉప్పు – ఒక టేబుల్‌స్పూన్‌, యాలకలు – 6, చింతపండు – పావు కప్పు, లవంగాలు – 6
తయారుచేసే విధానం :
కందిపప్పు ముందు రాత్రిగానీ లేదా వండేందుకు ముందు కనీసం మూడు గంటల సేపు నానబెట్టండి. టమాటోలను తరిగి ముక్కలుగా కోసుకోండి. పప్పును కడిగి శుభ్రం చేయండి. నాలుగు కప్పుల నీరుపోసి చేర్చి మెత్తగా ఉడికించి, వార్చి తీసుకోండి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, అల్లం, లవంగాలు, దాల్చినచెక్క, యాలకులు, జీలకర్ర, ధనియాలు నూరి మెత్తని ముద్ద చేయండి. పుదీనా, కొత్తిమీరలను సన్నగా తరిగి పెట్టుకోండి. అరకప్పు నీటిలో చింతపండును నానబెట్టండి. ఉల్లిపాయలను సన్నగా తరిగి 3/4కప్పు నూనెను వేడిచేసి అందులో ఉల్లిముక్కలను వేసి బంగారు రంగు వచ్చే వరకూ వేయించండి. అందులో నూరిన మసాలా ముద్దను ధనియాజీరా పొడినిచేర్చి కలపండి.నూనె మసాలాలు విడిపోతుండగా వార్చిపెట్టుకున్న పప్పు మిశ్రమాన్ని ఇందులో వేయండి. సన్నని మంటమీద ఉడకనివ్వండి. అర్థగంట ఉడకనిచ్చి తరిగిన పుదీనా, కొత్తిమీర, చింతపండురసం వేసి కలపండి. కూర ఇగిరి దగ్గర పడుతుండగా దించండి. టమాటో రైస్‌తో కలిపి వడ్డించితే చాలా రుచిగా ఉంటుంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/