శరీరాకృతి మీద పట్టు..

వ్యాయామంతో అందం, ఆరోగ్యం

Beauty and health with exercise
Beauty and health with exercise

మనకు తెలియకుండానే శరీరాకృతి మీద నియంత్రణ కోల్పోతుంటాం. పోశ్చర్‌ సమస్యలలో ఇబ్బంది పడుతుంటాం. శరీరాకృతి మీద పట్టు సాధించాలంటే వ్యాయామాలు చేయాలి.

నేలమీద పడుకుని, తల మీదుగా చేతులు రెండూ చాచి నేల మీద ఆనించాలి. తర్వాత ఎడమకాలు, కుడిచేతిని గాల్లోకి లేపి, దింపాలి. తర్వాత కుడి కాలు, ఎడమ చేతిని గాల్లోకి దింపాలి.

ఇలా నేలమీద స్విమ్మింగ్‌ చేస్తున్నట్లుగా చేతులు కాళ్లు కదిలించాలి. ఇలా చేసే స్విమ్మర్స్‌ను దాదాపు 30 సార్లు చేయాలి.

నేలమీద పడుకునే రెండు చేతులు ముందుకు చాచి మోచేతులు మడవాలి.తర్వాత కుడి చేతిని వీపు వైపు వెనక్కి తీసుకువెళ్లి, ఎడమ కాలును తాకించాలి. తర్వాత ఎడమ చేతిని వీపై

శరీరాకృతి మీద పట్టు..
Beauty and health with exercise

వైపు వెనక్కి తీసుకువెళ్లి కుడి కాలును తాకించాలి. దీన్ని స్వింగ్‌ బ్యాక్‌ అంటారు.

దీన్ని కూడా 30 సార్లు చేయాలి. నేలమీద పడుకుని చేతులు రెండూ తల మీదుగా చాచి నేలను తాకాలి.

రెండు చేతులు, రెండు కాళ్లను వీలైనంత మేరకు గాల్లోకి లేపి దింపాలి. ఇలా వరుగా 30సార్లు చేయాలి.

అలాగే నేలమీద పడుకుని రెండు చేతులు తల మీదుగా పైకిలేపి నడుముకు దగ్గరకు తేవాలి.

తిరిగి మామూలుగా పెట్టాలి ఇదేవిధంగా 30 సార్లు చేయాలి. దీన్ని స్నో ఏంజిల్స్‌ అంటారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం: https://www.vaartha.com/news/business/