కరోనా సెకండ్ వేవ్ ఎఫెక్ట్ : అంతర్జాతీయ విమాన సర్వీసుల నిషేధం పొడిగింపు
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

New Delhi: కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకల నిషేధాన్ని పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతేడాది జూన్ 26వ తేదీన జారీ చేసిన ఆదేశాలను కొనసాగిస్తున్నట్లు, ఇంటర్నేషనల్ కమర్షియల్ ప్యాసింజర్ సర్వీసులను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు స్పష్టంచేసింది. ఈ మేరకు డీజీసీఏ జాయింట్ కలెక్టర్ జనరల్ సునీల్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉండగా ఎంపిక చేసిన దేశాలకు మాత్రం విమానాలు నడుస్తాయని పేర్కొన్నారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/