రాధే శ్యామ్ నుండి ‘సంచారి’ సాంగ్ టీజర్ వచ్చేసింది

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – గోల్డెన్ బ్యూటీ పూజా హగ్దే జంటగా రాధా కృష్ణ డైరెక్షన్లో రూపొందుతున్న పీరియాడిక్ మూవీ ‘రాధే శ్యామ్’. సాహో తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఫై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ తరుణంలో చిత్రంలోని సాంగ్స్ ఒక్కోటిగా విడుదల చేస్తూ ఆసక్తి పెంచుతున్నారు. క్రమంలో ‘సంచారి’ అనే మూడో పాటను రిలీజ్ చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం మధ్యాహ్నం ఈ పాటకు సంబంధించిన టీజర్ ను వదిలారు.

‘రాధేశ్యామ్’ సినిమా దక్షిణాది భాషలకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తుండగా… హిందీ వెర్సన్ కు మిథున్ – అనూ మాలిక్ – మనన్ భరద్వాజ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నాలుగు భాషల్లో వచ్చిన ‘సంచారి’ పాటకు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూర్చగా.. తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ తనదైన శైలిలో ఎంతో హుషారుగా ఆలపించారు. ‘చల్.. చలో.. సంచారి.. చల్ చలో.. కొత్త నేలపై’ అంటూ సాగిన ఈ పాటకు కృష్ణకాంత్ (కెకె) సాహిత్యం అందించారు. ప్రేమనే గమ్యస్థానంగా ఎంచుకుని ప్రభాస్ చేసే ప్రయాణాన్ని ఈ టీజర్ లో చూడొచ్చు. అందమైన లొకేషన్స్ లో చిత్రీకరించిన ఈ గీతం విజువల్ గా కూడా ఆకట్టుకుంటోంది. ప్రభాస్ ఇందులో మంచు పర్వతాలలో స్కేటింగ్ చేస్తూ.. సైకిల్ మరియు కార్ లో ప్రయాణిస్తూ.. గుర్రాన్ని పట్టుకొని కనిపించాడు. ‘సంచారి’ ఫుల్ లిరికల్ సాంగ్ ను డిసెంబర్ 16 గురువారం విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

ఈ సినిమాలో ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణంరాజు, బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14న భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు.