ఢాకాలో పునర్నిర్మించిన రమ్నాకాళీ మందిరాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి
President Kovind to inaugurate renovated Ramna Kali Mandir in Dhaka
ఢాకా: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఢాకాలో పునర్నిర్మించిన రమ్నా కాళీ మందిరాన్ని ప్రారంభించారు. విక్టరీ డే సెలబ్రేషన్స్ కోసం బంగ్లాలో రామ్‌నాథ్ మూడు రోజుల పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. 1971 యుద్ధం సమయంలో పాకిస్థాన్ ఆర్మీ సుమారు 250 మంది హిందువులను అత్యంత కిరాతకంగా హతమార్చింది. ఆ తర్వాత ఆ ఆలయాన్ని నేలమట్టం చేసింది. పాకిస్థాన్ ఆర్మీ చేపట్టిన ఆపరేషన్ సెర్చ్‌లైట్‌లో భాగంగా హిందువులను చంపేశారు. 600 ఏళ్ల క్రితం నాటి ఆలయంపై 1971 మార్చి 27లో పాక్ ఆర్మీ కాల్పులు జరిపింది. ఆ ఆలయంలో ఉన్న ప్రధాన పూజారిని కూడా హతమార్చారు. 2017లో అప్పటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ ఆలయాన్ని ప్రాంతాన్ని విజిట్ చేశారు. ఆ తర్వాత ఇక్కడ రమ్నా ఆలయ పునర్ నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయి.
తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/