హైదర్‌గూడలో ఆరేండ్ల బాలుడు అదృశ్యం
6-years-boy-missing-in-hyderguda
హైదరాబాద్ : హైదర్‌గూడలో ఆరేండ్ల బాలుడు అదృశ్యం కలకలం రేపుతున్నది. రజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హైదర్‌గూడలో అనీష్ అనే ఆరేండ్ల బాలుడు కనిపించకుండా పోయాడు. గురువారం మధ్యాహ్నం సమయంలో ఆడుకుంటూ.. బిల్డింగ్‌పై నుంచి కిందికి వచ్చిన బాలుడు తిరిగి ఇంట్లోకి రాలేదు. దీంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికిన తల్లడిదండ్రులు ఎంతకీ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలుడి కోసం గాలిస్తున్నారు. మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. బాలుడు తప్పిపోయి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/