హైదరాబాద్ లో మరో దారుణం : ఐదేళ్ల బాలుడి ఫై వీధి కుక్క దాడి

హైదరాబాద్ లో వీధి కుక్కల దాడులు ఏమాత్రం తగ్గడం లేదు. GHMC వీధి కుక్కల విషయంలో చర్యలు తీసుకుంటున్నామని చెపుతున్నప్పటికీ..ఆ చర్యలు ఎక్కడ కనిపించడం లేదు. ప్రతి రోజు GHMC పరిధిలో వీధి కుక్కల దాడులు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఈరోజు హైదరాబాద్‌లోని బడంగ్ పేట్‌ మున్సిపాలిటీ పరిధిలో వీధి కుక్క స్వైర విహారం చేసింది.

టీచర్స్‌ కాలనీలో నడుచుకుంటూ వెళ్తున్న ఐదేళ్ల బాలుడిపై వీధి కుక్క ఒక్కసారిగా దాడి చేసింది. దీంతో ఆ చిన్నారి కిందపడిపోయాడు. దీంతో బాలుడు ఒక్కసారిగా అరడంతో స్థానికంగా ఉన్న వాళ్లు విని బాబును కాపాడారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్‌ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతోంది. వీధి కుక్కల దాడులు రోజు రోజుకు ఎక్కువ అవుతుండడం తో ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు.