గాంధీ ఆస్పత్రిలో 45 మందికి కరోనా నెగిటివ్

హైదరాబాద్: గాంధీలో నిన్న కరోనా పరీక్షలు నిర్వహించిన 45 మందికి నెగిటివ్ రిపోర్ట్ వచ్చిందని డిహెచ్.శ్రీనివాస్ తెలిపారు. 45 మందిని ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ చేశారు. ఆ 45 మందిని హౌస్ ఐసోలేషన్‌లో ఉండాలని డాక్టర్లు సూచించారు. మరో ఇద్దరి అనుమానితుల శాంపిల్స్‌ను పుణెకు తరలించారు. వీరిలో ఒకరు ఇటలీకి చెందిన వ్యక్తి అని వెల్లడించారు. పాజిటివ్ కేసు వచ్చిన వ్యక్తికి దగ్గరగా ఉన్న ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు మరో ఇద్దరున్నారు. ఆ ఇద్దరికీ గాంధీ వైరాలజీలో ఉన్న ల్యాబ్‌లో టెస్టులు పూర్తి చేశారు కానీ కొన్ని అనుమానాలుండటంతో పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు వారికి సంబంధించిన శాంపిల్స్‌ను పంపామన్నారు. రిపోర్ట్స్ రేపు వస్తాయని చెబుతున్నారు. వాళ్లిద్దరినీ తప్ప మిగతావారందరినీ డిశ్చార్జ్ చేశామన్నారు.
తాజా ఇంగ్లీష్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/english-news/