నేటి నుండి బీహార్‌ అసెంబ్లీ సమావేశాలు

Bihar Legislative Assembly

పాట్నా: ఈరోజు నుండి కొత్తగా ఏర్పాటైన బిహార్‌ అసెంబ్లీ శాసనసభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలు సోమవారం నుంచి ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగనున్నాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. సభ్యుల మధ్య దూరం ఉండేలా సీట్లు ఏర్పాటు చేశారు. అలాగే సభ్యులందరూ తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని ఆదేశించారు. ప్రోటెం స్పీకర్‌గా సీనియర్‌ ఎమ్మెల్యే జీతన్‌రామ్‌ మాంఝీ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించనున్నారు. అలాగే స్పీకర్‌ ఎన్నికను సైతం నిర్వహించనున్నారు. ఇటీవల ముగిసిన ఎన్నికల్లో ఎన్డీఏ సంపూర్ణ మెజారిటీ సాధించగా.. వరుసగా నాలుగోసారి బిహార్‌ సిఎం గా నితీశ్‌కుమార్ ప్రమాణ స్వీకారం చేశారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/