మోడి అధ్యక్షతన క్యాబినెట్‌ సమావేశం ప్రారంభం

కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్న ప్రధాని మోడి

bjp meeting
Modi, AmithShah

న్యూఢిల్లీ: ప్రధాని మోడిని అధ్యక్షతన క్యాబినెట్‌ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కొన్ని కీలకమైన నిర్ణయాలను మంత్రివర్గం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. చైనాతో వివాదం, ప్రస్తుత కరోనా పరిస్థితులు, ఆర్థిక సంక్షోభం తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశానికి హోమ్ మంత్రి అమిత్ షాతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులందరూ హాజరయ్యారు. కరోనాతో పాటు చైనాతో సరిహద్దు వివాదాలు, లాక్ డౌన్ కారణంగా నెలకొన్న ఆర్థిక సంక్షోభం, మూడో విడత ఉద్దీపన తదితర అంశాలు కూడా చర్చకు రానున్నాయని సమాచారం.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/