ఒమిక్రాన్‌ తొలి మరణం.. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రకటన

లండన్‌: ప్రపంచాన్ని ఒమిక్రాన్‌ వేరియంట్‌ వణికిస్తున్నది. తాజాగా బ్రిటన్‌లో తొలి ఒమిక్రాన్‌ మరణం సంభవించినట్లు ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సస్‌ వెల్లడించారు. డెల్టా వేరియంట్‌ కంటే దీని తీవ్రత మోస్తరుగా లేదా తక్కువగా ఉంటుందని సంబురపడొద్దని సూచించారు. దీనినుంచి తప్పించుకోవాలంటే బూస్టర్‌ డోస్‌ వేసుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఒమిక్రాన్‌ను కట్టడి చేసేందుకు మరిన్ని కఠిన ఆంక్షలు తప్పవన్నారు.

నియంత్రణ చర్యలు తీసుకోకుంటే వచ్చే ఏడాది ఏప్రిల్‌ నాటికి ఒమిక్రాన్‌ వేరియంట్‌తో బ్రిటన్‌లో 25 వేల నుంచి 75 వేల వరకు మరణాలు సంభవించవచ్చని లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ హైజీన్‌ అండ్‌ ట్రాపికల్‌ మెడిసన్‌ అధ్యయనం పేర్కొన్నది. గతేడాదితో పోలిస్తే ఈసారి పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని, ఎక్కువ కేసులు నమోదు కావడంతో పాటు దవాఖానల పాలయ్యే వారి సంఖ్య కూడా పెరుగుతుందని హెచ్చరించింది. పాకిస్థాన్‌తో పాటు చైనాలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదైంది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/