పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు ధన్య‌వాదాలు

ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా మాదే విజయం: ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో విజ‌యంపై మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్, జ‌గ‌దీశ్ రెడ్డి

హైదరాబాద్: తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. దీనిపై ప‌లువురు టీఆర్ఎస్ నేత‌లు స్పందిస్తూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు. ఉమ్మ‌డి ఆదిలాబాద్ జిల్లాలో టీఆర్ఎస్‌కు తిరుగులేద‌ని తెలంగాణ‌ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఏ ఎన్నిక‌లు వ‌చ్చినా త‌మ పార్టీనే విజయం సాధిస్తుంద‌ని చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థుల‌ గెలుపు కోసం కృషి చేసిన త‌మ పార్టీ నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌కు ధన్య‌వాదాలు తెలిపారు.

మ‌రోవైపు, ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా స్థానిక సంస్థ‌ల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో త‌మ పార్టీ అభ్య‌ర్థి కోటిరెడ్డి విజ‌యం సాధించ‌డంపై తెలంగాణ‌ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి స్పందిస్తూ.. ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా మొత్తం కేసీఆర్ వెంటే న‌డుస్తోంద‌ని ఈ ఎన్నిక‌ల ద్వారా మ‌రోసారి స్ప‌ష్ట‌మైంద‌ని చెప్పారు.

త‌మ పార్టీ అభ్య‌ర్థి గెలుపున‌కు స‌హ‌క‌రించిన టీఆర్ఎస్ నేత‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతున్న‌ట్లు పేర్కొన్నారు. తాము ప్ర‌తిప‌క్ష పార్టీల‌ కుట్ర‌ల‌ను తిప్పికొట్టామ‌ని ఆయ‌న చెప్పారు. నల్లగొండ జిల్లాలో త‌మ పార్టీ తిరుగులేని శక్తిగా మారింద‌ని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ గెలుపుతో ఆ పార్టీ కార్యాల‌యాల వ‌ద్ద నేత‌లు, కార్య‌క‌ర్త‌లు సంబ‌రాలు చేసుకుంటున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/