హెచ్‌1బి వీసాల తాత్కాలిక నిలిపివేత

హెచ్‌1బి వీసాల తాత్కాలిక నిలిపివేత
H-1 B visa

వాషింగ్టన్‌: అమెరికా హెచ్‌1బి వీసాలను తాత్కాలికంగా నిలిపివేయాలని భావిస్తోంది. ఐటి ఉద్యోగులకు జారీ చేసే పని ఆధారిత వీసాలతో పాటు విద్యార్థులకు ఇచ్చే వీసాలను కూడా నిలిపివేయనున్నట్లు శుక్రవారం అక్కడి మీడియా వెల్లడించింది. కరోనా వైరస్‌తో అత్యధికంగా నిరుద్యోగం పెరిగే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. కాగా హెచ్‌1బి వీసాపై సుమారు 5లక్షల మంది వలసకార్మికులు పనిచేస్తుంటారు. ఈ వీసాల నిలిపివేతపై ఇమ్మిగ్రేషన్‌ అడ్వైజర్స్‌ ఈ మేరకు విధి విధానాలు, ప్రణాళికలు రూపొందిస్తున్నారని, త్వరలో ప్రకటించవచ్చని వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. ఐటి నిపుణుల కోసం జారీ చేసే హెచ్‌1బి వీసాలు, కార్మికులకు జారీ చేసే హెచ్‌2బి వీసాలు, విద్యార్థుల వీసాలపై ఈ నివేదిక దృష్టి సారించనున్నట్లు తెలిపింది. అయితే కరోనా మహమ్మారి కారణంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ నిలిచిపోవడంతో రెండునెలల్లో సుమారు 33 మిలియన్‌ల అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/