హైదరాబాద్‌లోని గ్లాస్‌ గోదాంలో అగ్ని ప్రమాదం

Fire accident in hyderabad
Fire accident in hyderabad

హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. హైక్లాస్ గ్లాస్ గ్యాస్ గోదాంలో ఈ ప్రమాదం తలెత్తింది. కెమికల్‌ గోదాముకూ మంటలు వ్యాపించాయి. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. గోదాంలో గ్యాస్‌ సిలిండర్లు లీక్ అవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అగ్ని మాపక సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/