ప్రభుత్వాసుపత్రి కోవిడ్ వార్డులో అగ్ని ప్రమాదం
భయంతో కరోనా పేషెంట్స్ పరుగులు : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణం
Vijayanagaram: జిల్లా మహారాజా ప్రభుత్వాసుపత్రి కోవిడ్ వార్డులో మంగళవారం అగ్ని ప్రమాదం జరిగింది. . పెద్దఎత్తున పొగలు వ్యాపించడంతో కోవిడ్ బాధితులు పరుగులు తీశారు. దీంతో ఆసుపత్రి సిబ్బంది మంటలు ఆర్పివేసి అధికారులకు సమాచారం అందించారు. కోవిడ్ ఐసీయూలోని కోవిడ్ పేషెంట్స్ను , మిగిలిన వార్డులోని కోవిడ్ రోగులను సాధారణ వార్డుకి తరలించారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమని అధికారులు తెలిపారు. తృటిలో పెను ముప్పు తప్పడంతో ఉపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాజా క్రీడా వార్తల కోసం: https://www.vaartha.com/news/sports/