ఢిల్లీ ఎయిమ్స్‌లో భారీ అగ్నిప్రమాదం

తొమ్మిదో అంతస్తులో చెలరేగిన మంటలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో గత రాత్రి 10.32 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పలు లేబొరేటరీలు, అత్యంత అధునాతన పరీక్ష కేంద్రాలు ఉన్న 9వ అంతస్తులో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. కాగా, సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న 26 అగ్నిమాపక శకటాలు దాదాపు రెండు గంటలపాటు శ్రమించి మంటలను అదుపు చేశాయి.

అయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. కొవిడ్‌-19 నమూనాలను సేకరించిన ప్రాంతంలో మంటలు చెలరేగాయని డెప్యూటీ చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్ సునీల్‌ చౌదరి తెలిపారు. రాత్రి రూ.10.30 గంటల సమయంలో తమకు అత్యవసర సమాచారం వచ్చిందని చెప్పింది. వెంటనే 22 ఫైర్‌ టెండర్లను తరలించి మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు చెప్పారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/