సిఎం నితీశ్‌ కుమార్‌పై బిజెపి నేత కైలాశ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు

అమ్మాయిలు బాయ్‌ఫ్రెండ్స్‌ను మార్చినట్లే.. బీహార్‌ సిఎం నితీశ్‌ కూడా.. కైలాశ్‌

BJP’s Kailash Vijayvargiya Slams Nitish Kumar

న్యూఢిల్లీః బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాశ్‌ విజయవర్గీయ బీహార్ సిఎం నితీశ్ కుమార్ వ్యవహార తీరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నితీశ్ ను విదేశీ మహిళతో పోల్చారు. విదేశీ మహిళలు మగ స్నేహితులను మార్చినట్టుగానే నితీశ్ వ్యవహారశైలి ఉందన్నారు. బీజేపీతో భాగస్వామ్యానికి ఇటీవలే నితీశ్ గుడ్ బై చెప్పి, ఆర్జేడీ, కాంగ్రెస్ ఆధ్వర్యంలోని మహాఘట్ బంధన్ తో కలసిపోవడం తెలిసిందే. నితీశ్ కుమార్ కు ఇలా భాగస్వాములను మార్చడం బీహార్ లో అలవాటుగా వస్తోంది.

బీజేపీతో తెగదెంపులు చేసుకోవడంపై మీడియా ముఖంగా విజయవర్గీయ మాట్లాడారు. ‘‘నేను విదేశాల్లో కొన్ని రోజుల పాటు ఉన్నప్పుడు.. ఇక్కడ మహిళలు తమ బోయ్ ఫ్రెండ్స్ ను ఎప్పుడైనా మార్చుకుంటారని ఒకరు నాతో చెప్పారు. బీహార్ ముఖ్యమంత్రి కూడా అంతే. ఆయన ఎవరి చేయి పట్టుకుంటారో, ఎవరిని వదిలేస్తారో మనకు ఎప్పటికీ అర్థం కాదు’’ అని విజయవర్గీయ అన్నారు. మహిళల పట్ల గౌరవానికి ఇది నిదర్శనమంటూ కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా ట్విట్టర్లో విమర్శించారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/