యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం

యాదాద్రి భువనగిరి జిల్లాలో ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జిల్లాలోని పగిడిపల్లి-బొమ్మాయిపల్లి మధ్య బెంగాల్‌ నుంచి సికింద్రాబాద్‌ వస్తున్న ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లోని రెండు బోగీల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన సిబ్బంది వెంటనే రైలును నిలిపివేశారు.

ప్రయాణికులను రైలులో నుంచి దించివేశారు. దీంతో ప్రాణనష్టం తప్పింది. దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ సికింద్రాబాద్‌ నుంచి ఘటనా స్థలానికి బయలుదేరారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. రెండు భోగీలు పూర్తిగా దగ్ధం అయ్యాయి.