ప్రధాని మోడీ వరంగల్ పర్యటనకు సీఎం కేసీఆర్ దూరం

pm-modi

ప్రధాని మోడీ రేపు (జులై 08) తెలంగాణలోని వరంగల్ లో పర్యటించనున్నారు. ఈ పర్యటన కు సీఎం కేసీఆర్ దూరంగా ఉంటున్నారు. ప్రధాని మోడీ పర్యటనను బహిష్కరిస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఏ మొహం పెట్టుకొని ప్రధాని మోడీ తెలంగాణ కు వస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ పుట్టుకను మోడీ అవమానించారని , ప్రతి అంశంలోనూ మోడీ తెలంగాణ ఫై విషం కక్కుతున్నారని కేటీఆర్ అన్నారు.

ఇక ప్రధాని మోడీ పర్యటన విషయానికి వస్తే..రేపు ప్రధాని మోడీ కాజీపేట వ్యాగన్ ఓవన్ హాలింగ్ సెంటర్ కు శంకుస్థాపన చేయనున్నారు. జులై 8న వారణాసి నుంచి ప్రత్యేక విమానంలో ఉదయం 9.45 గంటలకు ప్రధాని మోడీ హైదరాబాద్‌లోని హకీంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడ్నుంచి 9.50 నిమిషాలకు హెలికాప్టర్‌లో వరంగల్‌కు బయల్దేరి వెళ్లనున్నారు.

ఆ తర్వాత 10.35 గంటలకు వరంగల్‌లోని హెలిప్యాడ్‌కు మోడీ చేరుకోనున్నారు. 10.45 గంటల నుంచి 11.20 గంటల వరకు పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం 11.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.10 గంటల వరకు వరంగల్‌లో జరిగే బహిరంగ సభకు మోడీ హాజరై ప్రసంగించనున్నారు. ఆ సభ ముగించుకుని 12.15 గంటలకు వరంగల్ హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడ్నుంచి మధ్యాహ్నం 1.10 గంటలకు హకీంపేట్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో రాజస్థాన్‌కు బయల్దేరి వెళ్లనున్నారు.