రాహుల్ గాంధీపై ట్వీట్.. అమిత్ మాల‌వీయపై కేసు న‌మోదు

రాహుల్ గాంధీ యూఎస్ ట్రిప్ వీడియోని షేర్ చేసిన మాలవీయ

FIR filed against Amit Malviya in Bengaluru for his tweets on Rahul Gandhi

న్యూఢిల్లీః బిజెపి ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవీయపై కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై చేసిన ట్వీట్లకు గాను బెంగళూరులోని హై గ్రౌండ్స్ పోలీసు స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మాలవీయకు వ్యతిరేకంగా కర్ణాటక కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే రమేశ్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

రాహుల్ గాంధీ యూఎస్ పర్యటన వీడియోని అమిత్ మాలవీయ ఇటీవలే ట్విట్టర్ లో షేర్ చేశారు. ‘‘రాహుల్ గాంధీ ప్రమాదకరం. మోసపూరితమైన ఆట ఆడుతున్నారు’’అని అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు. న్యాయ సలహా తీసుకున్న తర్వాతే కేసు నమోదు చేసినట్టు కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. దీనిపై బెంగళూరు దక్షిణ ఎంపీ తేజశ్వి సూర్య స్పందిస్తూ.. ఇది రాజకీయ ప్రేరేపిత చర్యగా పేర్కొన్నారు. దీన్ని కోర్టులో సవాలు చేస్తామని ప్రకటించారు. సంబంధిత సెక్షన్లు గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే వాటికి సంబంధించినవంటూ.. రాహుల్ గాంధీ వ్యక్తినా లేద గ్రూపా అని ప్రశ్నించారు.