వనస్థలిపురంలో ఘోరం : కన్న కూతురి ఫై తండ్రి లైంగికదాడి

ఈరోజుల్లో కామంతో వావివరుసలు మరచిపోతున్నారు. కన్నా కూతుళ్ల ఫై కూడా లైంగిక దాడులకు పాల్పడుతూ సభ్య సమాజం తలదించుకునేలా చేస్తున్నారు. ఇప్పటీకే ఈ తరహా ఘటనలు పలు చోటుచేసుకోగా..తాజాగా వనస్థలిపురంలో ఇదే తరహా దారుణం చోటు చేసుకుంది. కన్న కూతుళ్లపై తండ్రి లైంగికదాడికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే… నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన ఓ ఆటో డ్రైవర్‌ కుటుంబం.. వనస్థలిపురంలో నివాసం ఉంటుంది. ఈ ఆటో డ్రైవర్‌ కు.. ఐదురుగు సంతానం. అందులో ఇద్దరు మగవాళ్లు కాగా.. ఇద్దరు ఆడవాళ్లు. సదరు తండ్రి మద్యానికి బానిస..ప్రతి రోజు తాగి వస్తాడు. ఈ నేపథ్యంలోనే.. తన భార్య లేని సమయంలో.. కన్న కూతుళ్లపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. రోజూ మద్యం తాగొచ్చి కూతుళ్లను వేధించిన కసాయి తండ్రి.. 13 ఏళ్ల బాలికపై లైంగిక దాడి చేశాడు. ఈ ఘటనను చూసి మిగతా కూతుళ్లు గట్టిగా అరిచారు. దీంతో ఆ కసాయి తండ్రి.. ఇంటి నుంచి పరార్‌ అయ్యాడు. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.