ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు

యాచారం పీఎస్ లో ఎంపీపీ సుకన్య ఫిర్యాదు

ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు
TRS MLA Manchireddy Kishan Reddy

Hyderabad: ఇబ్ర‌హీంప‌ట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదైంది.

ఇటీవ‌ల ఓ శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఎమ్మెల్యే కిషన్ రెడ్డి తనను కించపరిచేలా మాట్లాడారంటూ ఎంపీపీ సుకన్య యాచారం పీఎస్ లో ఫిర్యాదు చేశారు.

ఎమ్మెల్యేతో పాటు ఏసీపీ యాదగిరి, సీఐ గురువారెడ్డిపైనా ఆమె పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

యాచారం మండల కేంద్రంలో ఫార్మిసిటీ రోడ్డు శంకుస్థాప‌న కార్యక్రమానికి టీఆర్ఎస్ నేతలందరినీ ఆహ్వానించిన అధికారులు..

స్థానిక ఎంపీపీ అయిన సుకన్యను ఆహ్వానించలేదు. దీంతో ఆమె కార్యక్రమం వద్దకు వచ్చి ఎమ్మెల్యేను, అధికారులను నిలదీశారు. శంకుస్థాపన కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.

ఈ క్ర‌మంలో ఆమెపై చేయి చేసుకున్నార‌ని, కులం పేరుతో దూషించార‌ని సుక‌న్య పిర్యాదు చేశారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ, సీఐ నారాయణపై కూడా ఎంపీపీ ఫిర్యాదు చేశారు.

ఆమె ఫిర్యాదు మేరకు వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ (సెక్షన్స్) కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్ర‌స్తుతం సుక‌న్య హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు.

తాజా ఎన్నారై వార్తల కోసం : https://www.vaartha.com/news/nri/