ఆస్ట్రేలియా భారత్‌కు తరలించిన 29 పురాతన వస్తువులను ప‌రిశీలించిన మోడీ

PM Modi inspects 29 antiquities repatriated to India by Australia

న్యూఢిల్లీ: ఇటీవ‌ల ఆస్ట్రేలియా నుంచి 29 ప్రాచీన విగ్ర‌హాల‌ను భారత్ కు తీసుకువ‌చ్చారు. ఆ విగ్ర‌హాల‌ను ఓ మ్యూజియంలో ఏర్పాటు చేశారు. వాటిని ప్ర‌ధాని మోడీ స‌మీక్షించారు. మ్యూజియంకు వెళ్లిన ఆ పురాత‌న వ‌స్తువుల్ని ప‌రిశీలించారు. ప్రాచీన క‌ళారూపాల్లో శిల్పాలు, పేయింటింగ్స్ ఉన్నాయి. సాండ్‌స్టోన్‌, మార్బుల్‌, బ్రాంచ్‌, బ్రాస్, పేప‌ర్ పనిత‌నానికి సంబంధించిన వ‌స్తువులు ఉన్నాయి. మొత్తం ఆరు క్యాట‌గిరీల్లో ప్రాచీన వ‌స్తువులున్నాయి. శివుడు, విష్ణువు, శ‌క్తితో పాటు జైన సాంప్ర‌దాయానికి చెందిన క‌ళాఖండాలు ఉన్నాయి. దేశంలోని రాజ‌స్థాన్‌, గుజ‌రాత్, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, త‌మిళ‌నాడు, తెలంగాణ‌, ప‌శ్చిమ బెంగాల్ రాష్ట్రాల‌కు చెందిన ప్రాచీన విగ్ర‌హాలు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియా నుంచి తెచ్చిన ప్రాచీన వ‌స్తువుల్లో 9వ‌, 10వ శ‌తాబ్ధానికి చెందిన‌వి ఉన్న‌ట్లు తెలుస్తోంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/